calender_icon.png 19 February, 2026 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్లవాయి రాయిసెంటర్ సార్మడి జుగ్నాక దేవ్ రావు మృతి

19-02-2026 05:26:30 PM

గ్రామంలో విషాద ఛాయలు

జైనూర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్     మండలం మార్లవాయి గ్రామానికి చెందిన రాయిసెంటర్ సార్మడి జుగ్నాక దేవ్ రావు  గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.దేవ్ రావు ఆదివాసీ సమాజంలో రాయిసెంటర్ సార్మేడిగా అనేక సంవత్సరాలు సేవలందించారు. సంప్రదాయ న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామంలో పలు సామాజిక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు.మార్లవాయి గ్రామపంచాయతీలో ఎంపీటీసీగా కూడా పనిచేసిన ఆయన, గొండ్వా పంచాయతీ రాయిసెంటర్ సార్మేడిగా ప్రజలకు న్యాయం చేయడంలో విశేష కృషి చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.ఆయన మృతితో మార్లవాయి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులకు, ఆదివాసీ సమాజానికి ఈ లోటు తీరనిదిగా భావిస్తున్నారు.