calender_icon.png 19 February, 2026 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

VTGCET–2026 హాల్ టికెట్ సెంటర్ చిరునామా సవరణ

19-02-2026 05:24:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష–2026 (VTGCET–2026)కు సంబంధించిన హాల్ టికెట్లలో ఒక పరీక్షా కేంద్రం చిరునామాలో చిన్న పొరపాటు చోటుచేసుకున్నట్లు మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలు సమన్వయకర్త శ్రీధర్, జిల్లా కోఆర్డినేటర్ బి. శ్వేత సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.సెంటర్ నెంబర్ 260412కు సంబంధించి హాల్ టికెట్‌లో

“ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్ స్కూల్/జూనియర్ కాలేజ్, గన్నారం, గోడవెల్లి రోడ్, ఆసిఫాబాద్” అని తప్పుగా ముద్రితమైందని, ఇందులో “గన్నారం” అనే గ్రామపేరు పొరపాటున చేరిందని తెలిపారు.విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురికాకుండా ఆసిఫాబాద్ మండలంలోని మోడల్ స్కూల్ ఎదురుగా, గోడవెల్లి రోడ్ లో గల ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్ స్కూల్ / కాలేజ్ రావాలని సూచించారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తల్లిదండ్రులు కనీసం ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని పేర్కొన్నారు.