ఉత్తమ అవార్డు అందుకున్న మార్కెట్ గ్రేడ్ 3 కార్యదర్శి
15-08-2026 02:43 PM
కేసముద్రం, (విజయక్రాంతి): ఉత్తమ సేవలకు గాను ప్రభుత్వం నుండి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ 3 కార్యదర్శి రాజేంద్రప్రసాద్ ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రం అందుకున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యఅతిథి, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.






