15 August, 2026 | 4:35 PM

మువ్వన్నెల ఎగిరిన జాతీయజెండాలు

15-08-2026 03:43 PM

సుల్తానాబాద్ లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు.

సుల్తానాబాద్, ఆగస్టు  15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలు  ఘనంగా నిర్వహించారు.త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు , మున్సిఫ్ కోర్టు ఆవరణలో జడ్జి దుర్గం గణేష్,  తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బషీరుద్దీన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, పోలీస్ స్టేషన్ లో సిఐ రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధకృష్ణ, కమిషనర్ రమేష్ , ఆర్యవైశ్య సంఘ భవన్ లో ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు  కొమురవెల్లి భాస్కర్ తోపాటు ప్రభుత్వ , ప్రైవేటు కళాశాలలో, స్కూల్లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు, అలాగే గ్రామ గ్రామాన వేడుకలను ఘనంగా నిర్వహించారు , ఈ కార్యక్రమములో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు యువకులు తదితరులు , పాల్గొన్నారు.