16 March, 2026 | 8:39 PM

మార్కెట్ వేలం.. రూ.6.55 లక్షల ఆదాయం

16-03-2026 07:17 PM

పాపన్నపేట: పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తైబజారు హక్కుల కోసం వేలంపాట నిర్వహించారు. దున్న శివగౌడ్ రూ.6.55 లక్షలతో అధిక ధర పలికి హక్కులు దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.5.29 లక్షలు పలకగా ఈ సారి రూ.6.55 లక్షలు పలికింది.

గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి గ్రామ పంచాయతీకి రూ.1.26 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్, ఎంపీఓ శ్రీశైలం, కార్యదర్శి నయీమ్, గ్రామస్థులు పాల్గొన్నారు.