16 March, 2026 | 10:15 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

16-03-2026 07:22 PM

కలెక్టర్ గరిమ అగ్రవాల్

గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో సిద్ధం చేసిన ప్రచార రథాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. పశువుల పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి.. రోగాల బారి నుంచి జీవాలను రక్షించాలని సూచించారు.

అన్ని పాడి పశువులు, నాలుగు నెలల వయసు దాటిన ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచార రథంతో అవగాహన కల్పించాలని సూచించారు.