9 May, 2026 | 3:49 AM

పీఏసీఎస్ చైర్మన్‌గా మారిపెద్ది మంగమ్మ బాధ్యతల స్వీకరణ

09-05-2026 01:44 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 8: మండల పరిధిలోని తిమ్మాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్)చైర్మన్‌గా మారిపెద్ధి మంగమ్మ శుక్రవారం సొసైటీ కార్యాలయంలో తిరిగి బాధ్యతలు చేపట్టారు.

హైకోర్టు తీర్పు మేరకు బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని, రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

అనంతరం బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, డైరెక్టర్లను ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీశ్రీనివాస్ గౌడ్, సర్పంచులు బొడ్డు ఇందిరాసోమరాజు, నున్న యాదగిరి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, సీఈఓ వూర సత్యనారాయణ, డైరెక్టర్లు చల్లా వేణుధర్ రెడ్డి, నూకల గురువయ్య, మంగదుడ్ల మల్లయ్య, నోముల రమేష్, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీరయ్య, సుజాత, ఎల్లమ్మ, ఉపసర్పంచ్ దేశిడి సందీప్ రెడ్డి, నాయకులు దశరథరామారావు, లింగమూర్తి, శ్రీకాంత్, ప్రభాకర్, సత్యనారాయణ, సైదులు, మధు, మహేష్, నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.