9 May, 2026 | 2:54 AM

90 వసంతాల వార్షికోత్సవంలో ఆకాశవాణి

09-05-2026 01:46 AM

2 కె రన్ లో ఆకాశవాణి కొత్తగూడెం సిబ్బంది

కొత్తగూడెం, మే 8 ,(విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుక్రవారం రోజున 90 వసంతల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు(వాయిస్ ఆఫ్ నేషన్) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం ఏడు గంటలకు టు కె రన్ మారథాన్  ను జెండా ఊపి ప్రారంభించారు. కృషి విజ్ఞాన్ కోఆర్డినేటర్ టి. భరత్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకరరావు, సీనియర్ ఇంజనీర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రేడియో స్టేషన్ నుండి  ప్రారంభమై,, రామవరం వరకు ఈ 2 కె రన్ వాక్తాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరిగి రామవరం నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్, మీదుగా , రేడియో స్టేషన్కు చేరుకొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కొలీపాక శంకరరావు మాట్లాడుతూ , 1936 లో డెక్కన్ నామకరణంతో మొదలై కాలక్రమమైన ఆకాశవానిగా పరిణతి చెందిందని, నాటినుండి నేటి వరకు ఆకాశవాణి ప్రజలకు ఎంతో చేరువైందని పలు ఆసక్తికరమైన కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో శ్రోతల హృదయాల్లో పదిలంగా తన స్థానాన్ని పదులపరుచుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ టూకే రన్ వల్ల ప్రతి ఒక్కరూ నిత్యం వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలని దాని ద్వారా సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని, తద్వారా ,ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయని , తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, పశు వైద్యులు ఆనంద్, ఆకాశవాణి ఇంజనీరింగ్ సీనియర్  అసిస్టెంట్ బాబు సింగ్ , ప్రోగ్రాం హెడ్ కోలిపాక శంకరరా వు, పర్యావరణ ప్రేమికుడు మొక్కల రాజశేఖర్, క్యాజువల్ అనౌన్సర్స్ , ,సెక్యూరిటీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.