ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ
వెల్దుర్తి,(విజయక్రాంతి): ఎల్ నీనో ప్రభావం వల్ల సాధారణంగా వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలు,కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఎంఏఓ ఝాన్సీ తెలిపారు.శనివారం వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు సర్పంచ్ లకు ఎల్ నినో ప్రభావం గురించి రైతు వేదికలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎం ఏ వో ఝాన్సీ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం పరిస్థితుల్లో తక్కువ నీటితో పెరుగే, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే పంటలను ఎంచుకోవడం మంచిదని, పంటలు వేయడానికి అనుకూలమైన పంటలు జొన్న,సజ్జ,రాగి, పెసర, మినుములు, కంది, సెనగ,నువ్వులు,ఆముదం తక్కువ కాలంలో పండే విత్తన రకాలను ఎంచుకోవాలని తెలిపారు.వర్షం వచ్చిన వెంటనే విత్తనం వేయాలని పొలంలో తేమ నిల్వ ఉండేలా మల్చింగ్ లేదా ఇతర తేమ సంరక్షణ పద్ధతులను పాటించాలని డ్రిప్ వంటి నీటి పొదుపు పద్ధతులను ఉపయోగిస్తే ప్రయోజనం కలుగుతుందన్నారు.






