30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

‘పోలీసు’ ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు

31-05-2026 12:00 AM

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి 

మేడ్చల్, మే 30 (విజయక్రాంతి): పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు అధికారులు పదవీ విరమణ చేసిన సందర్భంగా నేరేడుమెట్ లోని సిపి కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయని, వీటిని ఎదుర్కొని సుదీర్ఘ కాలం పాటు సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేయడం అభినందనీయమన్నారు.

పదవీ విరమణ తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు రావలసిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా చేతికందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏసిపి క్రైమ్స్ కే కరుణ సాగర్, కంట్రోల్ రూమ్ ఎస్త్స్ర పి బాలరాజు, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఎస్‌ఐ టి ప్రభాకర్, సరూర్నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ మహమ్మద్ అలీ, అంబర్పేట్ హెడ్ క్వార్టర్ ఏ ఆర్ ఎస్ ఐ అంజి రెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ జి నరేందర్ రెడ్డి లను సిపి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ శివకుమార్, సి ఏ ఓ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి, బి రవీందర్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ భద్ర రెడ్డి, ఏసీపీ రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో-ఆపరేటివ్ ఎకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, బాలరాజు, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.