29 July, 2026 | 10:38 AM

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భీమ్ రావు పాటిల్

29-07-2026 09:54 AM

బోథ్, (విజయక్రాంతి):  సోనాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ్రావు పాటిల్(Bheem Rao Patil) ను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కంబంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు. సోయం బాబూరావు డిసిసి జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ తెలంగాణ రాష్ట్ర విచారణ రాష్ట్ర కన్వీనర్ తుల అరుణ్ కుమార్. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టినందుకు పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పాటుపడతానన్నారు.