7 July, 2026 | 3:26 AM

బీఆర్‌ఎస్ నేత విష్ణునాయక్ తండ్రిని పరామర్శించిన మన్నె గోవర్ధన్ రెడ్డి

07-07-2026 12:00 AM

ఖైరతాబాద్, జూలై 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ డివిజన్కు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విష్ణు నాయక్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విష్ణు నాయక్ తండ్రికి తీవ్ర గాయాలు కాగా, విష్ణు నాయక్ అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన తండ్రిని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈ రోడ్డు ప్రమాద సమాచారం తెలుసుకున్న ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వెంటనే స్పందించి నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణు నాయక్ తండ్రిని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.