11 August, 2026 | 2:23 AM

అర్ధరాత్రి గద్దె కూల్చివేతపై మన్నె గోవర్ధన్‌రెడ్డి మండిపాటు

11-08-2026 01:10 AM

ఖైరతాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్య మ నాయకుడు, మా జీ ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను అర్ధరాత్రి వేళ కూల్చివేయడాన్ని ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఇన్చార్జ్ మన్నె గోవర్ధన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉద్యమ చరిత్రను చెరిపేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గద్దెను కూల్చివేయవచ్చేమో గానీ, ప్రజల మనసుల్లో నిలిచిన పెద్ది సుదర్శన్రెడ్డి పోరాట స్ఫూర్తిని చెరిపివేయడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు.

అధికారులను అడ్డుపెట్టుకుని అర్ధరాత్రి కూల్చివేతలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని, ఉద్యమకారులపై కక్షసాధింపు చర్యలను నిలిపివేసి గద్దె కూల్చివేత ఘటనపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని మన్నె గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు.