29 April, 2026 | 9:21 PM

పేదింటి ఆడబిడ్డకు అండగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు

29-04-2026 07:34 PM

వెల్దుర్తి,(విజయక్రాంతి):  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి వెల్దుర్తి మండల  సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగి కృష్ణ మరోసారి అండగా నిలిచాడు. పెదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేయూతను అందించి మానవత్వం చాటుకున్నాడు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ కూతురు మానస  వివాహం సందర్భంగా వెల్దుర్తి మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రంగి కృష్ణ చేతుల మీదుగా పుస్తె మట్టలను అందజేశారు.

పెళ్లి ఖర్చులతో సతమాతమవుతున్న తన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పెదింటి ఆడబిడ్డ పెళ్లికి తోడుగా నిలిచిన, రంగి కృష్ణ ను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రంగి కృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నము.

ఇప్పటివరకు మండల వ్యాప్తంగా15 నుండి 20 నిరుపేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు పుస్తె మట్టలను పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో తన వంతు కృషిగా పేదింటి ఆడబిడ్డ పెళ్లిలకు సహాయం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పర్వాంచు శేఖర్,బిఆర్ఎస్ నాయకులు హనుమంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజిరెడ్డి, సత్తిరెడ్డి, ఆంజనేయులు, యేసయ్య, రాజు, రమేష్, శ్రీకాంత్ తదితరులు గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.