4 April, 2026 | 3:36 AM

ఘనంగా యుఫోరిక్ ఫెస్ట్, ఓఆర్‌ఎస్‌ఏ 26

04-04-2026 01:47 AM

గ్లోబల్ ప్రొఫెషనల్ కాలేజీల ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అం డ్ టెక్నాలజీ (అటానమస్), గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ (అటానమస్), గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ - మొయినాబాద్, ఏప్రిల్ 1,2వ తేదీల్లో జాతీయ స్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ ఓఆర్‌ఎస్‌ఏని ఘనంగా నిర్వహించారు. సంస్థ స్థాపించబడిన 20వ సంవత్సరాన్ని గుర్తుచేసుకుంటూ, 2500+ మంది ప్రతినిధులు, విద్యార్థులు, సిబ్బందికి ఆతిథ్యం ఇచ్చారు.

గేమింగ్ కాన్క్లేవ్, స్పోర్టివా, రేసింగ్ ట్రాక్లు, ఫైర్లెస్ ఫియస్టా, బ్యాటిల్ ఆఫ్ బోర్డ్లు, టెక్నికల్ ఈవెంట్లు - కోడ్ రష్, కోడ్ డీబగ్, టెక్ పిక్టో, డిబేట్, కౌన్ బనేగా గ్లోబల్ స్టార్ (కెబిజిఎస్), ట్రెడిషనల్ డే, ఫ్లాష్మాబ్, ట్రెజర్ హంట్, పురుషుల ఫిజిక్ వంటి ప్రత్యేకతల ను ప్రదర్శించారు. ఈ ఫెస్ట్ అటువంటి ఈ వెంట్లను సమన్వయం చేయడానికి, నిర్వహించడానికి విద్యార్థుల్లో విశ్వాసం, సృజనా త్మకత, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.  కళ్లు చెదిరే వేషధారణ లో అద్భుతమైన ప్రదర్శనలు, వైబ్లింగ్ పాతకాలపు థీమ్లు సమా వేశాన్ని హోరెత్తించాయి.

‘ధున్’ బ్యాండ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి తమ ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేసిం ది. డెరైక్టర్ కేఎమ్ ఫసీహుద్దీన్, డైరెక్టర్ మరియా తబస్సుమ్, డీన్స్, ప్రిన్సిపా ల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ నిర్వహణతో, ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ జీ అహ్మద్ జీషన్ ప్రముఖ మార దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా నిర్వహించబ డింది. వైస్ ప్రిన్సిపాల్ - ఇంజినీర్‌తో పాటు కో-కన్వీనర్లు, చీఫ్ కో-ఆర్డినేటర్లు చందన, స్నే హ, శివాని, ఆకాష్, మనోజ్, వసీమ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నౌమాన్ అహ్మద్, మనల్ అహ్మద్, శ్రీకాంత్, రాహుల్, రెహాన్, ఫారి సా, ఇతర విద్యార్థి కో ఆర్డినేటర్లతో సహా ఆర్గనైజింగ్ కమిటీ టీమ్ సారథ్యం వహించింది.