4 April, 2026 | 3:33 AM

బీజాపూర్‌లో భారీ డంప్‌లు స్వాధీనం

04-04-2026 01:44 AM

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న కూంబింగ్

చర్ల్ల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్ స్టేషన్ ప రిధిపెద్ద జోజెర్, లేండ్రా అటవీ ప్రాం తంలో శుక్రవారం మావోయిస్టులకి చెందిన రెండు భారీ డంప్‌లను సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ బృందం స్వాధీనం చేసుకుంది. 303 రైఫిల్, స్టెన్ గన్, బీజీఎల్ రౌండ్స్, డిటోనేటర్లు, జిలేటన్ స్టిక్స్, వైర్, మావోయిస్టు సామాగ్రి త యారుచేయడానికి ఉపయోగించే వస్తువు లున్నాయి. బస్తర్‌లో మిగిలిన మావోయిస్టు ల కోసం కూంబింగ్ ముమ్మరం చేసినట్లు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు.

ఆయుధా లు వీడి వస్తే మంచిదన్నారు. మావోయిస్టు ల కోసం వేట కొనసాగిస్తూనే లొంగుబా టు ప్రయత్నాలను కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరే షన్ కింద చేపట్టిన మిషన్ ముగిసినప్పటికీ భద్రత బలగాలు అడవిలో మిగిలి ఉన్న మావోయిస్టుల కోసం వేటను ముమ్మరం చే శారు.లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు డంప్‌లను స్వాధీనం చేసు కు నే పనుల్లో బలగాలు నిమగ్నమయ్యాయి.