5 May, 2026 | 8:15 PM

Breaking News

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •   మృతురాలి పాపని చూసి కన్నీటి పర్యంతమైన సీతక్క   •   రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా   •   పిఎసిఎస్ చైర్మన్‌గా అలీ బిన్ అహ్మద్ బాధ్యతల స్వీకరణ   •   జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు..   •   ఏరియా పర్సనల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుపతి   •   సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి   •  

ఆర్థిక ఇబ్బందులతో టిఫన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి ఆత్మహత్య

06-01-2026 08:36 PM

మునుగోడు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం పోర్లగడ్డతండా గ్రామానికి చెందిన వడ్య భాస్కర్ తండ్రి లచ్య (34), లంబాడా కులం అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి  మునుగోడు టౌన్ లోని చండూర్ రోడ్డు లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ అతని భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.

హోటల్ వ్యాపారం సరిగా జరగక ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడి అప్పులు కావడంతో మనస్థాపనికి గురై సోమవారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో మునుగోడులోని అతను అద్దెకు తీసుకున్న నివాసంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోగా, మంగళవారం తెల్లవారుజామున 04:00 గంటలకు మృతిని భార్య, తండ్రి నిద్రలేచి చూసేసరికి అప్పటికే మరణించడంతో మృతిని తండ్రి లచ్య మునుగోడు పోలీస్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు.