30 April, 2026 | 5:21 PM

నాచారం గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యం

30-04-2026 03:26 PM

దమ్మపేట, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మండల పరిధిలోని నాచారం గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం గ్రామానికి చెందిన డేరంగుల నాగరాజు (33) ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్ళాడని, అప్పటి నుండి ఈ రోజు వరకు తిరిగి ఇంటికి రాలేదని, స్నేహితులు, బంధువుల వద్ద నాగరాజు కోసం వెతకగా ఆచూకీ తెలియలేదని, గురువారం భార్య డేరంగుల సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దరాప్తు చేపట్టినట్లు ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపారు.