20 June, 2026 | 12:01 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

19-06-2026 07:54 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిదిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఎస్ఐ కృష్ణ రెడ్డి   తెలిపారు. వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బైరి చిన్న ఎల్లా గౌడ్ (45) కల్లు గీత కార్మికుడు  జూన్ 3 వ తేదీన జగదేవపూర్ మండల కేంద్రంలో పని కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో పత్తి మిల్లు సమీపంలో పార్కింగ్ చేసిన వడ్ల ట్రాక్టర్ ను వెనకాల నుండి డీ కొని తీవ్రంగా గాయపడగా గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కొంపల్లి లో గౌతమ్ న్యూరో ఆసుపత్రికి తరలించగా 18 వ తేదీ అర్థ రాత్రి మరణించినట్లు ఎస్ ఐ తెలిపారు.మృతిడికి భార్య కవిత,ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.మృతిడి కుమారుడు బైరి జశ్వంత్ ఇచ్చిన పిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.