యూరియా యాప్ ఎత్తివేయాలని రైతుల నిరసన
19-06-2026 09:53 PM
కామారెడ్డి జిల్లా పోసానిపేటలో రైతుల ఆందోళన
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం యూరియా యాప్ ను ఎత్తివేసి పాస్ బుక్ ల ప్రకారం యూరియాను పంపిణీ చేయాలని శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. యాప్ పేరిట రైతులకు సకాలంలో యూరియా అందడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి యూరియా యాప్ను ఎత్తివేసి గతంలో మాదిరిగా పాసుబుక్ ప్రకారం యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, లింగారెడ్డి, తిరుపతి, రాజేందర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






