19 June, 2026 | 11:19 PM

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం.. ఫైర్ సేఫ్టీపై రవాణా శాఖ అవగాహన

19-06-2026 07:52 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రధాన కూడలిలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సుల తనిఖీలతో పాటు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ బస్సుల్లో ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగ విధానం, అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లే పద్ధతులను అధికారులు ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతోనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వినియోగాన్ని ప్రదర్శింపజేసి అవగాహన పెంపొందించారు. రవాణా శాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు విశేష స్పందన తెలిపారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా స్కూల్ బస్సుల తనిఖీలు, ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.