19 June, 2026 | 10:58 PM

సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన

19-06-2026 07:57 PM

ఏఎంసి వైస్ చైర్మన్ పవన్ కుమార్

నంగునూరు,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. నంగునూరులో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజలు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సాంబా మసూరి,తెలంగాణ సోనా,హెచ్ఎంటీ వంటి సన్న రకాల వడ్లనే సాగు చేయాలని, గంగా కావేరి వంటి రకాలతో మార్కెటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని సూచించారు.