24 April, 2026 | 8:28 PM

డీసీఎం, ద్విచక్ర వాహనం ఢీ... వ్యక్తి మృతి

24-04-2026 06:43 PM

అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి...

డీసీఎం వాహనం వదిలీ పరారైన డ్రైవర్...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడుకోల్ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం డీసీఎం వాహనం టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన కురుమ హనుమాన్లు తన స్నేహితులతో కలిసి శుక్రవారం కుస్తీ పోటీలను తిలకించడానికి వచ్చారని ఆయన తెలిపారు.

మధ్యాహ్నం అందజా ఒకటిన్నర గంటల సమయంలో తాడుకుల్ చౌరస్తాలో టిఫిన్ చేసినా అనంతరం బస్టాండ్ వైపు వెళ్తున్న సమయంలో తన యొక్క మోటార్ సైకిల్ వద్దకు వెళ్లి మోటార్ సైకిల్ పై ఎక్కుచుండగా అదే సమయంలో కొయ్య గుట్ట వైపు నుండి వస్తున్న టిఎస్ 18 టి 7137 నెంబర్ గల డీసీఎం వాహనాన్ని నడిపి వ్యక్తి వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో హనుమాన్లు కింద పడిపోగా,  ఆట్టి డీసీఎం వాహనం యొక్క టైరు వ్యక్తి పైకి ఎక్కడంతో కడుపు నడుము భాగంలో తీవ్ర రక్త గాయాలు అక్కడికక్కడే మృతి చెందాడని సిఐ తెలిపారు.మృతుని భార్య కురుమ బీరవ్వ ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.