బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి
24-04-2026 05:46 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని బక్కమంతుల గూడెం గ్రామ ప్రధాన రహదారిపై శుక్రవారం మధ్యాహ్న సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. అదే దారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హుజుర్ నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన భోగాల కృష్ణా రెడ్డి (45) గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






