24 April, 2026 | 8:44 PM

ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

24-04-2026 06:57 PM

పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని భయంతో..

పాపన్నపేట: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఉరి వేసుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(17) కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసింది. పరీక్షలు రాసిన నుంచి ఇంట్లో దిగులుగా ఉంటుంది. దిగులుగా ఉంటున్నావని తల్లి లత అడగగా పరీక్షలు సరిగ్గా రాయలేనని, ఫెయిల్ అవుతానని భయం వేస్తుందని చెప్పింది.

ఫెయిల్ అయినా ఏమీ కాదని, ధైర్యంగా ఉండమని తల్లి ధైర్యం చెప్పింది. శుక్రవారం తల్లి లత గ్రామ శివారులో ఆరబోసిన వడ్ల కుప్పల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయిప్రియ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి అన్నం తీసుకురావడానికి వచ్చిన సోదరుడు గమనించి తల్లికి, చుట్టూ పక్కల వారికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.