సర్పంచ్ అధ్యక్షతన దమ్మపేట పంచాయతీ గ్రామ సభ
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, కార్యదర్శి బండి అనంత కుమార్ అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉదయం 9 గంటలకు జరగవలసినప్పటికీ కోరం లేకపోవడంతో, సమావేశాన్ని వాయిదా వేసి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిర్వహించారు. ఈ సమావేశంలో ముందస్తుగా కార్యదర్శి మాట్లాడుతూ స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీ రాజ్ సంస్థల పాత్రను గుర్తించే లక్ష్యంతో మన దేశంలో ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా నిర్వహిస్తారని, అదే రోజున గ్రామసభ నిర్వహిస్తారనీ తెలియజేసారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజలను సమస్యలను తెలియజేయాలనగా దమ్మపేట బస్టాండ్ లో నిర్మించిన పెట్రోల్ బంకు నిర్మాణాన్ని తొలగించి బస్టాండ్ ప్రాంగణం విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోమని కోరగా, దానికి స్పందించి ఇప్పటికే తమ దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారని, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు విధివిధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కొత్తపేటకు వెళ్ళే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా మాంసం దుకాణాలు నిర్వహించడంతో కొనుగోలుదారులు వారి వాహనాలతో ఆ రహదారి గుండా రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలియజేయగా మాంసం దుకాణాల ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో వొక్క మొక్కలు పెంచితే రాకపోకలకు పంచాయతీకి ఆదాయం వస్తుందని అనగా అన్నిరకాల పనికివచ్చే ఉన్నతాధికారుల సూచన మేరకు జూన్ లో మొక్కలు వేస్తామని తెలియజేశారు. సిమెంట్ రోడ్లు కొలతలు కొలిచారు ఇంతవరకు వేయలేదనగా, సర్పంచి స్పందిస్తూ స్పదిస్తూ ఎమెల్యే నిధులకోసం ఎదురుచూస్తున్నామన్నారు, పారిశుద్ధ్య పనులలో భాగంగా ప్రతీ నెల జెసిబి తో డ్రైనేజీలు తీపిస్తున్నారు దీనికి పరిష్కార మార్గంగా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలి అనగా పంచాయతీ నిధులు డ్రైనేజీ నిర్మాణాలకు సరిపోవని ప్రభుత్వ నిధులు కోసం ఎదురుచూస్తున్నామని తెలియజేశారు.






