27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

16-04-2026 01:02 AM

ధర్మపురి,ఏప్రిల్15 (విజయక్రాంతి):వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేట గ్రామానికి చెందిన అంకతి పెద్ద కోటయ్య (65) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఎస్త్స్ర పి. ఉదయ్ కుమార్ తెలిపిన వివారాల ప్రకారం మృతుడు కూలీ పనులు చేసుకొని జీవిస్తాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8గంటలకు ఇంటి నుంచి పశువులు మేపడానికి వెళ్లి, అట్టి పశువులు కప్పారావుపేట గ్రామ శివారులో గల చెరువులోకి పోగా, వాటిని తోలడానికి మృతుడు కోటయ్య చెరువులోకి దిగగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినాడు.

అతని కొడుకు అంకతీ రవి ఇచ్చిన ఫిర్యాది కేసు నమోదు చేసి, దర్యాప్తు లో భాగంగా మృతుడు చనిపోయిన స్థలాన్ని సందర్శించి, మృతుడి శవాన్ని చెరువులోంచి బయటకు తీపించి అక్కడే శవ పంచనామా నిర్వహించి ఆ తర్వాత మృతుడి శవంకు పోస్ట్ మార్టం నిమ్మితం ప్రభుత్వ ఆసుపత్రి, జగిత్యాల కు తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు ఎస్త్స్ర ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.