25 August, 2026 | 2:07 AM

వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్ట్

25-08-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన వ్యక్తి ని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని బొమ్మకల్ గ్రామంలోని మధురానగర్ కు చెందిన ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. గత ఆరు నెలలుగా సీతారాంపూర్ కు చెందిన బైక్ మెకానిక్ మెడిదొడ్డి సాయికుమార్ కు ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్, సదరు వివాహితతో తరచుగా ఫోన్లో మాట్లాడటం, మెసేజ్లు చేయడం ప్రారంభించాడు. అనంతరం ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి, ఆమెను బెదిరిస్తూ తనతో మాట్లాడాలని, లేకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఆమెను బ్లాక్మెయిల్ చే స్తూ పలుమార్లు బలవంతంగా శారీరకంగా వేధించినట్లు తెలిపింది.

ఈ విషయం అనంతరం కుటుంబంలో వివాదం ఏర్పడటంతో భర్త తన కుమారుడిని తన వద్ద ఉంచుకుని, కుమార్తెను తన వద్దకు పంపినట్లు తెలిపారు. అనంతరం ఆమెకు న్యాయవాది ద్వారా కోర్టు నుంచి విడాకు ల నోటీసు పంపించినట్లు తెలిసింది. సాయికుమార్ ను ఈ విషయంపై ప్రశ్నించగా, తనకు అవసరమైనప్పుడు ఆమెను ఉపయోగించుకున్నానని, ఇకపై తన వద్దకు రావద్దని, ఎక్కడైనా చె ప్పుకోవచ్చని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో బాధితురాలు కరీంనగర్ రూరల్ పో లీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి సాయికుమార్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.