27 February, 2026 | 3:54 AM

సారా తయారుచేసి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

27-02-2026 12:00 AM

గాంధారి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లె గ్రామంలో ఈ నెల 3 వ తేదీన లకావత్ రాము అనే వ్యక్తి తన ఇంటి వద్ద అక్రమంగా సారాయి తయారుచేసి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు అతని ఇంట్లో పోలీసులు సోదా నిర్వహించగా కూలర్ లో దాచి ఉంచిన నాలుగు లీటర్ల సారాయిని స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.

నిందితుడు లకావత్ రాము ను గురువారం అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా సారాయి తయారు చేయడం, విక్రయించడం చట్ట విరుద్ధం అని, ఎవరైనా సారాయి తయారుచేసిన, అమ్మిన కఠిన శిక్ష తప్పదు అని ఆయన అన్నారు.