మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత
45 ఏళ్లుగా అజ్ఞాతం.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల( Telangana Police) ఎదుట లొంగిపోయారు. జార్ఖండ్‌లోని సరందా అడవిలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా కోసం గాలింపు కొనసాగుతుండగా, నరహరి(Narahari Surrenders) పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.
హనుమకొండ జిల్లా, కాజీపేట మండలం, సోమిడికి చెందిన నరహరి 1996 నుండి అజ్ఞాతంలో ఉంటూ పలు కీలక మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకున్నాడు. ఆయన భార్య ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని సమాచారం. పోలీసు బలగాలు ప్రస్తుతం అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులైన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బేస్రాలను పట్టుకోవడంపై దృష్టి సారించాయి.






