సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన
నానో యూరియా అంటగడుతున్నారని రైతుల ఆరోపణ
నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన...
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District) పోతంగల్ సహకార సంఘం పరిధిలోని హెగ్డేలి గ్రామంలో(Hegdoli Village) రైతులు సొసైటీకి తాళం వేసి మంగళవారం నిరసన తెలిపారు. పోతంగల్ విశాల సహకార సంఘం(Pothangal Cooperative Society) పరిధిలోని హెగ్డేలి గ్రామంలో రైతులు మాట్లాడుతూ తమకు అవసరం లేని నానో యూరియా లిక్విడ్, అంటగట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో తీసుకున్న లిక్విడ్ మిగిలిపోయి ఉందన్నారు.
మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ,ఒక లిక్విడ్ బాటిల్ తీసుకోవాల్సిందేనని సొసైటీ అధికారులు(Society Officials) పేర్కొంటున్నారని దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లిక్విడ్ తీసుకోవడం మూలంగా రైతులపై రూ.200 అదనపు భారం పడుతుందన్నారు. ఇప్పటికే మందుల రేట్లు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 10 సంచులకు ఒకటి ఇస్తే తీసుకుంటామని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు రుక్మయ్య, అర్జున్, సురేందర్, అశోక్, ప్రవీణ్, భారత్, చందు, గణేష్, రాము, ఆంజనేయులు, వినయ్, సురేందర్ పాల్గొన్నారు.






