రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం
గౌహతి: బీజేపీ నేతృత్వంలోని NDA సాధించిన ఘన విజయంతో అసోం ముఖ్యమంత్రిగా( Assam Chief Minister) మంగళవారం నాడు హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారా ప్రాంతంలో ఉన్న వెటర్నరీ మైదానంలో జరిగిన ఒక వైభవపూర్వక కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శర్మతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు(Union Ministers) అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్, పవిత్ర మార్గరీటా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్(BJP President Nitin Nabin) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరిణామం రాష్ట్రంలో కాషాయ పార్టీకి పెరుగుతున్న ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. 126 మంది సభ్యులు కలిగిన అసోం శాసనసభలో రికార్డు స్థాయిలో 102 స్థానాలను కైవసం చేసుకుని NDA కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇందులో BJP ఒక్కటే 82 నియోజకవర్గాలను దక్కించుకోగా, దాని కూటమి భాగస్వాములైన AGP, BPF చెరో 10 స్థానాలను గెలుచుకున్నాయి.






