12 May, 2026 | 1:09 PM

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన

12-05-2026 11:57 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండలంలోని బెజ్జూరు గ్రామంలోని  రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఏవో నాగరాజు తెలిపారు. తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చులను తగ్గించండి నేల ఆరోగ్యాన్ని కాపాడండి. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి ప్రకృతిని రక్షించండి. పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలనే సాగు చేయండి అధిక ఆదాయాన్ని పొందండి సాగునీటినీ ఆదాయాన్ని భావితరాలకు అందించండి సేంద్రీయ పద్ధతులను పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి అని రైతులకు సూచించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సిహెచ్ అనురాధ, కే సౌజన్య ఏవో నాగరాజు ఏఈఓ శ్రీధర్, కార్యదర్శి వైకుంఠం గ్రామ సర్పంచ్ సరోజ ఉప సర్పంచ్ ఆదర్శ్ గ్రామ రైతులు పాల్గొన్నారు.