17 April, 2026 | 8:40 PM

Breaking News

ఉపాధి పనుల పరిశీలన   •   వీసీని కలిసిన నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు   •   సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •  

అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

19-11-2025 12:35 AM

సిద్దిపేట క్రైం, నవంబర్ 18 : అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేం దర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని రాంనగర్ కు చెందిన కిర్ని అనిల్ కుమార్ అనే వ్యక్తి ప్రజల అవసరాలను ఆసరా చేసుకొని, వారి వాహనాలను తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నట్టు ఫిర్యాదు అందిందని చెప్పారు. మంగళవారం నిందితుడి పై కేసు నమోదు చేసి, 9 ద్విచక్ర వాహనా లు, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్టు చె ప్పారు. ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారాలకు పాల్పడితే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.