8 August, 2026 | 3:47 AM

యూఎస్‌పీసీ 4 దశల ఉద్యమాలను విజయవంతం చేయండి

08-08-2026 01:20 AM

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

ఆళ్ళపల్లి, ఆగస్టు 7, (విజయక్రాంతి): విధ్యా రంగ సమస్యలు ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శనివారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా  మధ్యాహ్న భోజన విరామ సమయంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆళ్లపల్లి , ఆశ్రమ ఉన్నత పాఠశాల అనంతోగు, జి పి ఎస్ మైలారం,   జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కోడు పిఆర్సి సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఈనెల 12వ తారీకు 13వ తారీఖున మండల కేంద్రంలో అధికారులకు మెమోరాండం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని, 21వ తారీకు నుండి 26 తారీకు వరకు రాష్ట్ర, జిల్లా సంఘాల, నాయకులు పర్యటనలు ,

ఈనెల 29వ తారీఖున హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఉంటుందన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ లో అసెంబ్లీ ముట్టడి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు కదలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొమరం శాంతారావు , మర్కోడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు,  బి బాబులాల్. కాంప్లెక్స్ప్రధానోపాధ్యాయులు  సిహెచ్ భద్రమ్మ, ఏటి ఎ రాష్ట్ర నాయకులు ముడిగ సమ్మయ్య ,టిపిటిఎఫ్, జిల్లా ప్రధానకార్యదర్శి, జోగ.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.