calender_icon.png 21 February, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ మహాసభ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

21-02-2026 06:28:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలో మహాసభ సంతు సమ్మేళనం(హిందూ జూడో మహాసభ) విజయవంత చేయాలని జిల్లా గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్ అధ్యక్షులుశంకర్ పటేల్ ఉన్నారు. నిర్మల్ పట్టణంలో వీరశైవ లింగాయత్ సంఘ భవనంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ. లింగ ధర్మం ప్రచారం. మహాత్మ బసవేశ్వర ఆశయాల, సమాజంలో శాంతి స్థాపన కొరకు ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ముధోల్ మండల కేంద్రంలోని బసవ గార్డెన్ లో నిర్వహించి ఈ సమ్మేళనానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాధువు సొంతం మహారాజులు మహాఋషులు హాజరవుతరన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీరశైవ లింగాయత్ బంధువులు ప్రజలు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ పటేల్, జిల్లా బాధ్యులు సామ్రా పటేల్ మాధవ్ పటేల్ సాయి పటేల్ దత్తు పటేల్ రామేశ్వర్ పటేల్ చంద్రకళ నర్సప్ప తదితరులు పాల్గొన్నారు