calender_icon.png 21 February, 2026 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

21-02-2026 06:26:59 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణతో పాటు సమాజానికి మేలు జరుగుతుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్ ప్రసాద్,రోటేరియన్ శైలేంద్ర సింగ్ అన్నారు. శనివారం తాళ్ల గొమ్మూరు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర సారపాక ఆధ్వర్యంలో సుమారు 15,000 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మొక్కలను నాటుతున్నారు.

వాతావరణ సమతుల్యత పాటించాలంటే మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు విధిగా చెట్ల పెంపకం చేపట్టాలని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగ్‌లను, కాటన్‌ బ్యాగ్‌లను ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రోటేరియన్ రాంబాబు, కార్యదర్శి రోటేరియన్ చాంద్ బాషా, రోటేరియన్లు శ్యామ్ కిరణ్, భాస్కర్,ప్రఫుల్ల కుమార్, చంగల్ రావు, బసప్ప రమేష్, రాజశేఖర్, సత్యనారాయణ,మురళీధర్, తిరుపతిరావు, మహేష్, రోటరాక్టర్స్ విద్యావాణి, మల్లికార్జున్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.