19 May, 2026 | 7:07 PM

Breaking News

జైనూర్‌లో రైతులకు సేంద్రియ సాగుపై అవగాహన సదస్సు   •   చెరువుల సుందరీకరణకు సహకరించాలి   •   ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు   •   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   •   జిల్లాలో డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి   •   విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు   •   సింగరేణి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు   •   పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి   •   కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు సాధించాలి   •  

విద్యుత్ వాడకంపై జాగ్రత్తలు పాటించాలి

21-02-2026 06:31 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): వేసవి కాలంలో విద్యుత్ వినియోగంపై  వినియోగదారులు జాగ్రత్తలు తీసుకుంటే  విద్యుత్ ప్రమాదాలు జరగావని విద్యుత్ శాఖ డీఈ ఈదన్న అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని దన్నోరా (బి) గ్రామంలో వేసవి కాలంలో విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...  విద్యుత్ తీగలపై వేరే వైర్లు వేసి దొంగతనంగా విద్యుత్ తీసుకుంటే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. ఇంట్లో విద్యుత్తు లేని వారు  విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి  అధికారికంగా విద్యుత్ సరఫరా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుందని ప్రజలకు వివరించారు. ఆయనతో పాటు ఏ.డి రోహిదాస్ జాదవ్, సర్పంచ్ జమున నాయక్, స్థానిక  ప్రజలు పాల్గొన్నారు.