9 April, 2026 | 11:37 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

చందానగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

02-12-2025 12:44 AM

-దగ్ధమైన 50 గుడిసెలు 

శేరిలింగంపల్లి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని చందానగర్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ నిర్మాణ సంస్థ పలు భారీ భవన సముదాయాలు నిర్మిస్తోంది. అందు లో పనిచేసే కార్మికులంతా అక్కడే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.

సోమవారం కార్మికులంతా పనుల్లో మునిగి ఉండగా.. ఒక్కసారిగా అక్కడి గుడిసెలకు నిప్పు అంటుకొని తగలబడిపోయాయి. దాదాపు 50 గుడిసెలు ఉన్నట్టుగా సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉంటుందని పోలీసులు ప్రా థమికంగా అంచనా వేస్తున్నారు.