విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
అమరావతి: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో(Visakha Steel Plant) ఘోరమైన అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మరుగుతున్న బకెట్లు పడటంతో ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం, పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ లో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయిందని అధికారులు తెలిపారు. ఎస్ఎంఎస్-2, ఎస్ టీసీ-3 హీట్ ఎఫ్ జీలో ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు.






