4 May, 2026 | 3:43 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •  

అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న

04-05-2026 02:16 PM

ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ ఆందోళన

ఇల్లందు, మే 4 (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా కొమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పంట తడిసి నష్టపోయిన పరిస్థితిలో లారీలు పంపడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్ మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నను సకాలంలో తరలించకపోవడంతో పంట తడిసి రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే లారీలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన పంటను ఆలస్యం చేయడంతో రైతులు మధ్య దళారులవైపు మొగ్గుచూపే పరిస్థితి ఏర్పడుతోందని, ఇది రైతులకు అన్యాయం అని పేర్కొన్నారు. కొమరారం మార్కెట్ యార్డ్ వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.