అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం
04-05-2026 02:21 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద సంఘటన లో 47 ఎకరాల లో నష్టం సంభవించిందని 44 లక్షల మేరకు రైతులు నష్టపోయారని ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం కను గుట్ట గ్రామానికి స్థానిక తాసిల్దార్ సుభాష్ చంద్ర వ్యవసాయ శాఖ ఏడిఏ విద్యుత్ శాఖ ఏడీలతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరిగిందని నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామన్నారు. అంతేకాక రైతులు పంట పొలాల్లో వినియోగించే పైపులు సైతం కాని బుడదయ్యాయని దీంతో నష్టం జరిగిన రైతులకు పరిహారం అందించే విధంగా అధికారుల దృష్టి తీసుకెళ్తామన్నారు






