ఎర్రుపాలెంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రారంభించిన మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం ఏప్రిల్ 6(విజయక్రాంతి): ఎర్రుపాలెం సొసైటీలో పిఎసిఎస్ ఎర్రుపాలెం ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సోమవారం ప్రారంభించినారు.
అనంతరం చైర్మన్ బండారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం రైతు సంక్షేమం కోరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాటకు కట్టుబడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మా కమిటీ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.




