7 April, 2026 | 3:05 AM

బచ్చన్నపేటలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు

07-04-2026 01:08 AM

బచ్చన్నపేట, మార్చి 6 (విజయక్రాంతి):బచ్చన్నపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బంగారు మహేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు బల్ల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ పార్టీ ఏర్పడడానికి అంత్యోదయ అనే ఒక మూల సిద్ధాంతంతో 1980లో ఏర్పడి నేడు దేశమంతా కూడా చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామ్య దేశంగా,  ఈ గొప్ప దేశంలో భారతీయ జనతా పార్టీ తన వంతు పాత్రగా నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమ్మడల్లి సర్పంచ్ బెజాడి సిద్ధులు, ప్రధాన కార్యదర్శి గద్దరాజు, జిల్లా నాయకులు దొంతుల చంద్రమౌళి, పెండెం నగేష్, కూరెళ్ళ వెంకట్ రెడ్డి, యువమోర్చా ప్రధాన కార్యదర్శి కక్కర్ల గణేష్, శ్రీను, ఆంజనేయులు, రాంబాబు, మంచాల రాజశేఖర్, కనకయ్య, తిరుపతి సాయితేజ, కార్యకర్తలు పాల్గొన్నారు.