గోండ్ తెగల నేపథ్యంలో మైసాహో!
నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఫీమే ల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడు దల చేశారు మేకర్స్. గోండ్ తెగల సాంస్కతిక నేపథ్యంతో తెరకెక్కుతున్న “మైసా” సినిమాలో రష్మిక ఇందులో ఓ శక్తిమంతమైన గోండ్ మహిళగా కనిపించనున్నారు.
‘రణబాలి’ నుంచి ప్రత్యేక వీడియో..
విజయ్ దేవరకొండ, రష్మి క మందన్న జంటగా రాహు ల్ సంకత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ “రణబాలి”. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు నేషనల్ క్రష్ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఈ వీడియోలో రశ్మిక ఎంత సహజంగా జయమ్మగా మారిపోయిందో చూపించారు. రణబాలి బలం జయమ్మ, అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ ఈ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తోంది.




