11 April, 2026 | 3:46 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

11-04-2026 01:44 PM

శ్రీరంగాపూర్, ఏప్రిల్ 11: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం సహాయ కార్యదర్శి జె. రాము, ప్రధాన కార్యదర్శి జి. క్రాంతి కుమార్, కోశాధికారి బి. అశోక్ తదితరులు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎం. మద్దిలేటి , ఉపసర్పంచ్ కళ్యాణి ఖాజా మాట్లాడుతూ, మహిళల విద్యాభివృద్ధికి మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. పూలే దంపతులు విద్యా ప్రాచుర్యానికి చేసిన కృషి వల్లే అనేక మంది మహిళలకు విద్యావకాశాలు లభించాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గూడెం ఎల్లస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆర్పీ బిసన్న, మాజీ వార్డు సభ్యుడు బలమోని ఆంజనేయులు, మాజీ సంఘ అధ్యక్షులు జె. బుచ్చన్న, కె. నారాయణ, డి. శ్రీనివాసులు, సుమన్, జి. శ్రీనివాసులు, జి. చరణ్, జి. శివ, కె. వెంకటేష్, జూదం శివకుమార్, జె. వెంకటేష్, సద్దు, సాయి, ఆటో డ్రైవర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.