మహారాష్ట్ర ఇసుక మన రాష్ట్రానికి రవాణా
భైంసా, మార్చి ౧ (విజయక్రాంతి): భైంసా డివిజన్లోని వివిధ ప్రాంతాలకు మహారాష్ట్ర నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అయినప్పటికీ అధికారులు దాని నియంత్రణపై కనీస చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్రలోని గోదావరి నది పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున కొందరు ఇసుక వ్యాపారులు ప్రతిరోజు భారీ వాహనాల్లో ఇసుకను తెలంగాణ సరిహద్దులోకి దాటిస్తున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ తదితర ప్రాంతాల నుంచి ధర్మాబాద్ మీదుగా తెలంగాణలోని బిదిరెల్లి తానూర్ బిల్ తరుడా మీదుగా అక్రమ రవాణా చేస్తున్నారు.
అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాపారులు భైంసా ప్రాంతాల్లోని కుంటాల తానూర్ కుబీ ర్ లోకేశ్వరం బాసర నర్సాపూర్ దిల్వాపూర్ తదితర మండలాలకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్ర ఇసుకను మన రాష్ట్రంలోకి రాకుం డా అడ్డుకోవలసిన అధికారులు చేతులు ఎత్తిస్తున్నారు. తొందర అధికారులు వ్యాపారం నుంచి ముడుపులు తీసుకొని రాత్రి సమయం లో గుట్టు చప్పుడు కాకుండా పచ్చ జెండా ఊపుతున్నారు.
భారీ వాహనాలు నడవడం వల్ల సరిహద్దు రోడ్లు దెబ్బతింటున్నాయని ఇసుక రోడ్డుపై పాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.ఆదివారం సరిహద్దు ప్రాం తాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వారాలను పట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక రవణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.




