10 August, 2026 | 4:24 AM

రావిచేడ్‌లో మహంకాళి బోనాల వేడుకలు

10-08-2026 12:29 AM

కడ్తాల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మండలంలోని రావిచేడ్‌లో కురుమ సం ఘం ఆధ్వర్యంలో బీరప్ప మహంకాళి బోనా ల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు సర్పంచ్ గోపాల్ పేర్కొన్నారు. వేడుకల్లో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.