23 June, 2026 | 5:08 PM

Breaking News

పాతబస్తీలో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు   •   ఆడబిడ్డ పెండ్లికి ఐదువేల ఆర్థిక సహాయం   •   హజ్-2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం   •   సుల్తానాబాద్ లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి   •  

ముంపు కాలనీలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్

23-06-2026 03:43 PM

పటాన్ చెరు: రాత్రి కురిసిన వర్షాల కారణంగా పటాన్‌చెరు పట్టణంలోని జేపీ కాలనీ GHMC డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పలు ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మాద్రి పృథ్వీరాజ్ కాలనీలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా HMWSSB మేనేజర్ ప్రేమ్ ని సంఘటనా స్థలానికి పిలిపించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాద్రి పృథ్వీరాజ్ తెలిపారు.