30 August, 2026 | 7:04 PM

సిద్ధిరామేశ్వర నగర్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక

30-08-2026 05:47 PM

భిక్కనూర్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నర్సంపేట లింగం, ఉపాధ్యక్షుడిగా గంధం నాగేష్, కార్యదర్శిగా బత్తుల శ్రీనివాస్, కోశాధికారిగా గోవిందు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా చుక్కాపూర్ సిద్ధిరాములు, వడ్ల మల్లేశం, కోతం కరణ్, భక్తుల నరసింహులు, బ్రహ్మచారిలను ఎంపిక చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నిక నిర్వహించారు.